తెలంగాణ

telangana

ETV Bharat / sports

అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి జాన్సన్ ఔట్

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​ నుంచి భారత్​కు చెందిన జిన్సన్ జాన్సన్ నిష్క్రమించాడు. స్టీఫుల్ ఛేజ్​లో అవినాశ్ సేబల్ నిరాశపరిచాడు.

అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి జాన్సన్ ఔట్

By

Published : Oct 5, 2019, 8:04 AM IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కనీసం సెమీఫైనల్‌ చేరతాడనుకున్న భారత అథ్లెట్‌ జిన్సన్‌ జాన్సన్‌ నిరాశపరిచాడు. 1500 మీటర్ల పరుగులో హీట్స్‌లోనే నిష్క్రమించాడీ కేరళ అథ్లెట్. 3 నిమిషాల 39.86 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్‌-5లో నిలిచిన రన్నర్స్​తో సమానంగా పరుగెత్తిన జాన్సన్‌.. రేసు చివర్లో లయ కోల్పోయాడు.

స్టీపుల్‌ ఛేజ్‌లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సేబల్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్లో 8:21.37 నిమిషాల్లో రేసు ముగించిన అతడు 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిప్‌రుటో (8:01.35; కెన్యా) స్వర్ణం గెలుచుకున్నాడు.

దలీలా ప్రపంచ రికార్డు
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా స్టార్‌ దలీలా మహమ్మద్‌ ప్రపంచ రికార్డు సాధించి స్వర్ణం గెలుచుకుంది. 52.16 సెకన్లలో రేసు ముగించింది దలీలా. సిడ్నీ మెక్‌లాలిన్‌ (52.23; అమెరికా) రజతం.. రషెల్‌ క్లేటన్‌ (53.74; జమైకా) కాంస్యం సొంతం చేసుకున్నారు.

400 మీటర్ల పరుగులో కొత్త ఛాంపియన్
మహిళల 400 మీటర్ల పరుగులో కొత్త ఛాంపియన్‌ వచ్చింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ షేన్‌ మిల్లర్‌ (బహ్రెయిన్‌)కు షాకిస్తూ సల్వా ఈద్‌ నాసెర్‌ (నైజీరియా) విజేతగా నిలిచింది. ఈ విభాగంలోని ఈ సీజన్​లో ఉత్తమ టైమింగ్‌ నమోదు చేస్తూ 48.15 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. షిరికా జాక్సన్‌ (జమైకా) కాంస్యం గెలిచింది.

ఇది చదవండి: విరాట్​తో సెల్ఫీ కోసం మైదానంలోకి వచ్చేశాడు

ABOUT THE AUTHOR

...view details