తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Athletics awards: స్ప్రింటర్ అంజూ బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు - world athletics awards 2021

world athletics awards 2021: స్ప్రింటర్​ అంజూ బాబీ జార్జ్​ అరుదై ఘనత సాధించింది. క్రీడారంగంలో ఆడపిల్లలు రాణించాలనే ఉద్దేశంతో ఆమె చేస్తున్న కృష్టికి ప్రతిష్ఠాత్మక 'ఉమెన్​ ఆఫ్​ ది ఇయర్​' అవార్డు అందించింది వరల్డ్​ అథ్లెటిక్స్​ ఫెడరేషన్​.

స్ప్రింటర్​ అంజు బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు, World Athletics awards, Anju Bobby George as Woman of the Year
స్ప్రింటర్​ అంజు బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

By

Published : Dec 2, 2021, 10:50 AM IST

Updated : Dec 2, 2021, 12:01 PM IST

మహిళా ప్రముఖ స్ప్రింటర్​ అంజూ బాబీ జార్జ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు ప్రతిష్ఠాత్మక 'ఉమెన్​ ఆఫ్​ ది ఇయర్​' అవార్డును ప్రకటించింది వరల్డ్​ అథ్లెటిక్స్ ఫెడరేషన్​. భారత క్రీడారంగం అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృష్టికి, ఎక్కువ మంది ఆడపిల్లలు, మహిళలు తన అడుగుజాడల్లో నడిచేలా స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందించింది.

స్ప్రింటర్​ అంజు బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

జార్జ్​.. 1977లో కేరళలో జన్మించిన ఈ మాజీ లాంగ్​ జంప్​ అథ్లెట్​ ఇప్పటికీ క్రీడా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటోంది. 2016లో ఓ ట్రైనింగ్​ అకాడమీని ప్రారంభించి ఎంతోమంది ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. వారికి మెంటార్​గానూ వ్యవహరిస్తోంది. ఇండియన్​ అథ్లెటిక్స్​ ఫెడరేషన్​లో సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​గానూ ఉంటోంది.

జార్జ్​ సాధించిన పతకాలు

  • 2003 పారిస్​ వరల్డ్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​జంప్​ విభాగంలో కాంస్య పతకం
  • 2005 వరల్డ్​ అథ్లెటిక్స్​ ఫైనల్స్​లో బంగారు పతకం
  • 2002 మాంచెస్టర్​ కామన్​వెల్త్​ గేమ్స్​లో కాంస్యం
  • 2002 మాంచెస్టర్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం
  • 2002 బుసాన్​, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం
  • 2005 ఇంచియాన్​, 2007 అమ్మన్​ ఏషియన్​ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణం, రజతం

జార్జ్​తో పాటు ఒలింపిక్స్​ ఛాంపియన్స్​ ఎలైన్​ థామ్​సన్​-హెరాకు 'వరల్డ్​ అథ్లెట్స్​ ఆఫ్​ ది ఇయర్​' అవార్డును ప్రకటించింది వరల్డ్​ అథ్లెటిక్స్​ ఫెడరేషన్​. ఈ పురస్కారాల ప్రదానోత్సవం వర్చువల్​గా నిర్వహించారు.

ఇదీ చూడండి:BWF World Tour Finals: సింధు, శ్రీకాంత్ శుభారంభం

Last Updated : Dec 2, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details