ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే వరకు విశ్రమించనని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పునరుద్ఘాటించింది. గతేడాది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ గెలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ.. దిల్లీలో జరిగే ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. "మరోసారి దేశం గర్వించే ప్రదర్శన చేస్తాననే విశ్వాసం నాకు ఉంది. అయితే, నా అంతిమ లక్ష్యం మాత్రం ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడమే. అంతవరకు విశ్రమించను అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిసి ఆనందాన్ని పంచుకుంటానని తెలిపింది. "నేను సల్మాన్ ఖాన్‌ను కలిసినప్పుడు.. ఆయన్ను చాలా విషయాలు అడుగుదామనుకున్నా. కానీ ఆయన నపై ప్రశ్నలు వర్షం కురింపిచారు. నా ఆట.. నా బ్యాక్ గ్రౌండ్.. గురించి చాలా ప్రశ్నలు అడిగారు. అది నేను మరిచిపోలేని అనుభవం. ఇక నేను ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే.. కనీసం ఒక్కసారైనా సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తా" అని సల్మాన్‌పై తన అభిమానం వ్యక్తం చేసింది నిఖత్ జరీన్.
బాక్సింగ్ అకాడమీ పెడతా..
ఒలింపిక్స్ స్వర్ణమే నా అంతిమ అల్టిమేట్ గోల్ అని గతంలోనే నిఖత్ చెప్పింది. దీంతో పాటు తాన భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటుందో అనే విషయం కూడా చెప్పింది. తాను రాబోయే రోజుల్లో బాక్సింగ్ అకాడమీ నెలకొల్పి.. యువతను బాక్సర్లుగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇక, విద్యార్థులందరికి ఆటల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఏదైనా సాధించాలని కోరారు.