మహిళా రెజ్లర్ నిశా దహియా.. గురువారం, ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ మహిళా రెజ్లింగ్ ఛాంపియన్పిష్లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున బరిలో దిగిన ఈమె.. 65 కిలోల విభాగంలో పతకం దక్కించుకుంది.
నిన్న చనిపోయిందని కలకలం.. నేడు స్వర్ణం గెలిచిందని సంబరం - స్పోర్ట్స్ న్యూస్
చనిపోయిందనే విషయమై వార్తల్లో నిలిచిన రెజ్లర్ నిశా.. తర్వాత రోజే జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది.
నిశా దహియా
అయితే హరియాణాలో బుధవారం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో నిశా చనిపోయిందనే వార్తలు వచ్చాయి. తాను జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనడంలో భాగంగా గోండాలో ఉన్నానని, తనకు ఏం కాలేదని వివరణ ఇచ్చింది. మరణించానంటూ వస్తున్న అసత్య వార్తలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
ఇవీ చదవండి: