క్రికెట్ అంటే సచిన్, రన్నింగ్ అంటే ఉస్సేన్ బోల్ట్, షూటింగ్ అంటే అభినవ్ బింద్రా పేర్లే తెలిసిన రోజుల్లో వారికంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అతి చిన్న వయసులోనే మైదానంలో దిగి.. అనుకున్న రంగంలో విజయం సాధించి.. ఇప్పటికీ పతకాల వేటలో పోరాటాన్ని సాగిస్తున్నారు. వారి కోసం ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
షెఫాలీ వర్మ
15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. స్కూల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. చదువుల్లో మునిగితేలుతుంటారు. కానీ టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ వయసులోనే అర్ధశతకం చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది షెఫాలీ వర్మ. 30 ఏళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది.
మాస్టర్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో ఓనమాలు దిద్దిన షెఫాలీ.. ఇప్పుడు అంతర్జాతీయ రికార్డులు అందుకుంటుంది. స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్తో టీ20ల్లోకి వచ్చింది షెఫాలీ. ప్రస్తుతం ఆమె స్థానంలో ఆడుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసింది.
హిమాదాస్
ఈ ఏడాది జులైలో జరిగిన టోర్నీల్లో 20 రోజుల వ్యవధిలో 5 స్వర్ణాలు గెల్చుకుంది భారత అథ్లెట్ హిమాదాస్. ఈ 19 ఏళ్ల స్ప్రింటర్ 200 మీటర్ల రేసులోనే 4 మెడల్స్ సాధించింది. 400 మీటర్ల విభాగంలో ఐదో పసిడి కైవసం చేసుకుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. అసోంలోని మారుమూల గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన హిమ.. వివిధ బ్రాండ్ల ద్వారా ఏడాదికి రూ.30 నుంచి 35 లక్షలు ఆర్జిస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రభావితం చేసిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ ఇండియా టాప్-30లో చోటు దక్కించుకుంది. యూనిసెఫ్‌లో భారత తొలి యూత్ అంబాసిడర్‌గా నియమితులైంది.
మనిక బత్రా
టెన్నిస్‌లో సానియా.. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు.. మరి టేబుల్ టెన్నిస్‌లో..? జవాబివ్వడానికి ఆలోచించాల్సిన పనిలేకుండా చేసింది దిల్లీ అమ్మాయి మనిక బత్రా. ముఖ్యంగా కామన్వెల్త్ క్రీడల్లో మనిక ప్రదర్శన అద్భుతం. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుందామె. వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌లోనూ స్వర్ణాలు సాధించింది మనిక. చైనా, కొరియాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న ఆసియా క్రీడల్లోనూ శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం గెలిచి అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది మనిక.
రాధా యాదవ్