French open 2022: టెన్నిస్ క్రీడాకారులకు ఫ్రెంచ్ ఓపెన్ కలల టోర్నీ. ఎర్రమట్టి కోర్టులో గెలిచి గ్రాండ్‌స్లామ్ సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటి ఆశలతోనే ఈ టోర్నీలో అడుగుపెట్టింది 19 ఏళ్ల చైనా క్రీడాకారిణి క్వినెన్ జెంగ్. వరల్డ్ నంబరు 74 క్రీడాకారిణి అయిన జెంగ్.. క్వాలిఫయర్‌తో పాటు తొలి మూడు రౌండ్లు గెలిచి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ప్రత్యర్థి ఎవరో కాదు.. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్, పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్. అయినా జెంగ్ భయపడలేదు. తొలి సెట్‌లోనే స్వైటెక్‌కు గట్టి షాకిచ్చింది. హోరాహోరీగా జరిగిన తొలి సెట్‌లో 7(5/7)-6తో టాప్‌సీడ్ స్వైటెక్‌ను ఓడించింది. సరిగ్గా అప్పుడే జెంగ్‌కు నెలసరి నొప్పి మొదలైంది. అయినా బాధను పంటి బిగువన పట్టి రెండో సెట్ మొదలుపెట్టింది. కానీ ఆ నొప్పి ముందు మ్యాచ్‌లో నిలవలేక తర్వాతి రెండు సెట్లు ఓడిపోయింది. దీంతో జెంగ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగింది.
'అబ్బాయినైతే బాగుండు.. ఆ 'నొప్పి' ఉండేదే కాదు'.. క్రీడాకారిణి భావోద్వేగం
French open 2022: ఈ కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కలలకు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. సవాళ్లను దాటుకుని గమ్యం వైపు పరుగులు పెడుతున్నారు. కానీ, ఆ ప్రయాణంలో కొన్ని సార్లు నెలసరి వంటి శారీరక వ్యక్తిగత సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్రీడాకారిణులకు ఇది పైకి చెప్పుకోలేని పెను సమస్యే. ఆ బాధనే ఎదుర్కొంది చైనాకు చెందిన ఓ టెన్నిస్ క్రీడాకారిణి. నెలసరి నొప్పి కారణంగా ఆమె కలలుగన్న ఫ్రెంచ్ ఓపెన్ ఆశలు ఆవిరయ్యాయి.
మ్యాచ్ అనంతరం జెంగ్ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురైంది. రుతుక్రమ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎవరికీ అర్థం కావంటూ ఆవేదన వ్యక్తం చేసింది. "ఇది అమ్మాయిల సమస్య. తొలి రోజు ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా నేను ఎప్పుడూ ఆటను వదిలిపెట్టలేదు. కానీ ఈ రోజు నొప్పి నన్ను చాలా బాధించింది. తొలి సెట్లో ఏమీ అనిపించలేదు. కానీ రెండో సెట్ సమయానికి కడుపునొప్పి మొదలైంది. అయినా నేను పోరాడుతూనే ఉన్నా. కానీ నాకు శక్తి సరిపోలేదు. ఆ నొప్పి చాలా కష్టంగా అనిపించింది. దీంతో నేను మ్యాచ్‌ను సరిగా ఆడలేకపోయా. ఈ రోజు నా ఆటతో నేను సంతోషంగా లేను. కానీ ప్రకృతికి విరుద్ధంగా మనమేం చేయలేం కదా. నిజంగా నేను అబ్బాయినైతే బాగుండేది. అప్పుడు ఈ నొప్పి ఉండేదే కాదు కదా" అంటూ జెంగ్ భావోద్వేగానికి గురైంది.
ఇదీ చూడండి:'బట్లర్ నా రెండో భర్త'.. మరో క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్!