Wimbledon bans Russia: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ టోర్నీలో ఆ దేశ ఆటగాళ్లు ఎవరూ పాల్గొనకుండా నిషేధం పడింది. ఈ మేరకు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది. యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్‌పైనా ఈ నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. రష్యాపై బ్యాన్ ఫలితంగా.. ప్రస్తుతం ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మెద్వెదెవ్కు టోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అతడితో పాటు 2021 వింబుల్డన్ సీజన్ సెమీఫైనలిస్ట్ ఆర్యానా సబలెంక(నాలుగో ర్యాంకు), ర్యాంకింగ్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆండ్రే రూబ్లెవ్కు సైతం టోర్నీకి దారులు మూసుకుపోయాయి. మహిళల విభాగంలో మాజీ నెం.1 విక్టోరియా అజరెంక, 2021 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అనస్తేషియా పవ్లియుచెంకోవా సైతం వింబుల్డన్‌కు దూరం కానున్నారు. జూన్ 27 నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కానుంది.
రష్యాకు వింబుల్డన్ షాక్.. ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధం - వింబుల్డన్ న్యూస్
Wimbledon bans Russia: వింబుల్డన్‌లో రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. బెలారస్‌పైనా ఈ నిషేధం అమలవుతుందని తెలిపింది. దీంతో మెద్వెదెవ్ సహా ప్రముఖ ఆటగాళ్లు టోర్నీకి దూరం కానున్నారు.
రష్యా అథ్లెట్లపై అనేక టోర్నీలు నిషేధం విధిస్తున్నాయి. రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి ఫిఫా, యూఈఎఫ్‌ఏలు బహిష్కరించాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్, హాకీ క్రీడా సమాఖ్యలు సైతం రష్యా, బెలారస్ దేశాల ఆటగాళ్లు అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడకుండా నిషేధం విధించాయి. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులూ రద్దయ్యాయి.
ఇదీ చదవండి:యథావిధిగా దిల్లీ, పంజాబ్ మ్యాచ్.. మరో గేమ్ వేదిక మార్పు