తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: హిమదాస్​కు నిరాశ.. ఒలింపిక్స్​కు దూరం! - Athelt himadas olympics

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశం చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది భారత్ అథ్లెట్ హిమదాస్(HimaDas). జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న సమయంలో ఆమెకు గాయం కావడమే కారణం. బలంగా పుంజుకుని ఆసియన్​ గేమ్స్​(2022), కామన్​వెల్త్​ గేమ్స్​(2022)లో బరిలో దిగుతానని చెప్పింది.

himadas
హిమదాస్​

By

Published : Jul 6, 2021, 7:52 PM IST

Updated : Jul 6, 2021, 8:20 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) బెర్తు కోసం శ్రమిస్తున్న భారత అథ్లెట్ హిమదాస్​కు(HimaDas) ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా మెగాక్రీడలకు అర్హత సాధించలేకపోయింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్​ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. బలంగా పుంజుకుని ఆసియన్​ గేమ్స్​(2022), కామన్​వెల్త్​ గేమ్స్​(2022)లో బరిలో దిగుతానని చెప్పింది.

"అర్హత పోటీ 100మీ, 200మీ రౌండ్​లో లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో గాయం అవ్వడం వల్ల ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశం చేజారిపోయింది. నాకు అండగా నిలిచిన కోచ్​, సహాయక సిబ్బంది, సహ ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని హిమదాస్​ చెప్పింది.

జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో 100 మీటర్ల హీట్ విభాగంలో పోటీ పడుతుండగా ఆమె కాలికి గాయమైంది. ఈ గాయం తీవ్రత ఎక్కువ అవ్వడం, 4x100మీటర్​ రౌండ్​లో తమ బృందం నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోడం వల్ల మెగాక్రీడలకు ఆమె అర్హత సాధించే అవకాశం చేజారిపోయింది.

ఇదీ చూడండి: ప్రపంచ అథ్లెటిక్స్‌కు హిమదాస్, ద్యుతిచంద్

Last Updated : Jul 6, 2021, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details