తెలంగాణ

telangana

ETV Bharat / sports

Neeraj chopra: 'నీరజ్​.. నీకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా?' - నీరజ్​ చోప్డా గురించి తేజస్విన్​ శంకర్

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు ఏకైక స్వర్ణం అందించిన నీరజ్​ చోప్డాకు (Neeraj Chopra) సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అథ్లెట్​ తేజస్విన్​ శంకర్ (Tejaswin Shankar)​. నీరజ్​ అంటే తనకు భయమని కూడా చెప్పాడు.

Neeraj Chopra, Tejaswin Shankar
నీరజ్​ చోప్డా, అథ్లెట్ తేజస్విన్​ శంకర్

By

Published : Aug 9, 2021, 4:35 PM IST

Updated : Aug 9, 2021, 8:48 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ నీరజ్‌ చోప్డా (Neeraj Chopra) సరికొత్త అధ్యయాన్ని లిఖించాడు. అయితే, మనకు ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌గా మాత్రమే తెలిసిన నీరజ్‌ చోప్డాలో ఆసక్తికర విషయాలు ఎన్నో దాగివున్నాయి. తాజాగా అతడి సన్నిహితుడు అథ్లెట్‌ తేజస్విన్​ శంకర్‌ (Tejaswin Shankar) ఎవరికీ తెలియని కొన్ని విషయాలను రాసుకొచ్చాడు.

నీరజ్​ చోప్డాతో తేజస్విన్​ శంకర్

'బెంగుళూరులో రెండు వారాల పాటు చోప్డాతో కలిసి ఒక గదిని పంచుకున్నాను. అతడిప్పుడు ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు. కానీ, అతడితో ఒక గదిని పంచుకోవడానికి నేను ఇప్పటికీ భయపడతాను. ఎందుకంటే, గదిలో తన బట్టలన్నీ చిందరవందరగా పడేస్తాడు. గది మధ్యలో సాక్స్‌ను ఆరబెడతాడు. తను చేసే పనులు ఇబ్బంది కలిగించినా నేను ఎప్పుడు అతనితో చెప్పలేదు. ఆ పదిహేను రోజుల పాటు మేమిద్దరం ఫ్రైడ్ రైస్, మట్కా కుల్ఫీని ఇష్టంగా తిన్నాం. అతడికి 'మినీ మిల్షియా' అనే వీడియో గేమ్ అంటే పిచ్చి. కానీ, ఇప్పుడు పబ్‌జీ ఆడటానికి మక్కువ చూపెడుతున్నాడు. అతడ్ని మళ్లీ కలిసినపుడు తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా అని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను' అని శంకర్ తెలిపాడు.

ఇదీ చదవండి:Neeraj Chopra: నీరజ్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

Last Updated : Aug 9, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details