ఒలింపిక్స్.. ఎన్ని రోజులైనా జరగొచ్చు. ఎన్ని క్రీడాంశాల్లోనైనా పోటీలు ఉండొచ్చు. అగ్రశ్రేణి దేశాలు.. అథ్లెట్లు ఎన్ని స్వర్ణాలైనా కొల్లగొట్టొచ్చు. ఎన్నో రికార్డు బద్దలవ్వొచ్చు. మరెన్నో ప్రత్యేకతలు చూడొచ్చు. కాని ఒలింపిక్స్ మొత్తాన్ని ఊపేసే స్టార్ ఒకరుంటారు. తన ప్రతిభ, ప్రదర్శన, విన్యాసాలతో యావత్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకునే స్టారాది స్టార్‌తో ఒలింపిక్స్ సంబరం అంబరాన్ని తాకుతుంది! గత మూడు ఒలింపిక్స్‌లలో ఆ స్థానంలో రారాజులా వెలుగొందాడు జమైకా పరుగు వీరుడు.. ఉసేన్ బోల్ట్(Olympics Usain Bolt)! రియో ఒలింపిక్స్ తర్వాత పరుగుకు బోల్ట్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతని వారుసుడెవరు? ఎవరాస్టార్?
ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు ఆయువు 10 సెకన్లలోపే! ఇలా మొదలై.. అలా ముగిసే 100 మీ పరుగు కోసం యావత్ ప్రపంచం నాలుగేళ్లు ఎదురు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సెకనులో వందో వంతు తేడాతో విజేతను నిర్ణయించే ఈ పరుగుకు.. మొత్తంగా ఒలింపిక్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఘనత బోల్ట్‌దే(Usain Bolt Speed). 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీ, 200 మీ.. 2012, 2016 ఒలింపిక్స్‌లో 100 మీ, 200 మీ, 4×100 మీ రిలేలలో బంగారు పతకాలతో బోల్ట్ హోరెత్తించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌తో స్టార్‌గా మారిన బోల్ట్.. లండన్, రియోలలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఏ క్రీడలోనైనా ప్రపంచకప్ ఫైనల్ మాదిరిగా బోల్ట్(Usain Bolt Record) రాకతో 100 మీ. పరుగు ఒలింపిక్స్‌లో పతాక సన్నివేశంగా మారిపోయింది. మరి బోల్ట్ రిటైర్మెంట్‌తో ఆ స్థానం ఎవరికి దక్కుతుందో.. ఆ తార ఏ క్రీడ తారనో..!
కొలనులో కేక
స్విమ్మింగ్ అంటే గుర్తొచ్చే పేరు.. మైకేల్ ఫెల్ఫ్స్. ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధికంగా 23 స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక ఆటగాడు. అయితే అతని వారుసడిగా దూసుకొచ్చిన మరో అమెరికా స్విమ్మర్ కలేబ్ డ్రెస్సెల్ కొలనులో కేక పుట్టిస్తున్నాడు. 2017 బుడాపెస్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు కొల్లగొట్టాడు. 2019 దక్షిణ కొరియా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 6 స్వర్ణాలు, 2 రజతాలతో ఒక ప్రధాన అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో 8 పతకాలు సాధించిన ఫెల్ఫ్స్ రికార్డును సమం చేశాడు. టోక్యోలో 50 మీ, 100 మీ ఫ్రీస్టైల్, 100 మీ బటర్‌ఫ్లై వ్యక్తిగత ఈవెంట్లతో పాటు టీమ్ విభాగాల్లో పోటీపడనున్న డ్రెస్సెల్.. ఫెల్ఫ్స్ రికార్డులపై గురిపెట్టాడు.
కొత్త చిరుత