ఒలింపిక్స్ పతకాల రేసులో అగ్రస్థానం ఎప్పుడూ అగ్రరాజ్యం అమెరికాదే. అయితే తమ దేశంలో జరిగిన 2008 ఒలింపిక్స్‌లో చైనా.. యూఎస్‌ను వెనక్కి నెట్టింది. డ్రాగన్ దేశం 48 పతకాలతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటే.. 36 పసిడి పతకాలతో అమెరికా రెండో స్థానానికి పరిమితం అయింది. కానీ తర్వాతి రెండు ఒలింపిక్స్‌లోనూ మళ్లీ అమెరికాదే అగ్రపీఠం. లండన్, రియో క్రీడలు రెండింట్లోనూ యూఎస్ సరిగ్గా 46 స్వర్ణాలే గెలవడం విశేషం.
Tokyo Olympics Medals: పతకాల వేటలో.. ఎవరిది పైచేయి?
ఒలింపిక్స్‌లో పతకాల వేటలో తొలిస్థానంలో ఉండేది దాదాపు అమెరికానే. ఒకటి రెండు సందర్భాల్లో చైనా కూడా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. మరి ఈసారి విశ్వక్రీడల్లో తొలిస్థానం ఎవరికి దక్కనుందో చూడాలి మరి.
2012లో చైనా 38 పతకాలతో రెండో స్థానం సాధిస్తే.. 2016లో బ్రిటన్ 27 పతకాలతో ద్వితీయ స్థానాన్ని చేజిక్కించుకుంది. గత పర్యాయం 26 పతకాలతో మూడో స్థానానికి పడిపోయిన చైనా.. ఈసారి ఎంతో పట్టుదలతో, గట్టిగా సన్నద్ధమై టోక్యోకు వస్తోంది. చైనా అవతల జరిగిన ఒలింపిక్స్‌లో ఆ దేశం అతి పెద్ద జట్టును బరిలోకి దించుతోంది ఇప్పుడే. అమెరికా ఎప్పట్లాగే భారీ, బలమైన బృందంతో బరిలోకి దిగుతోంది. అగ్రస్థానానికి ఈ రెండు దేశాల మధ్యే పోటీ ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి:రెండంకెల సంఖ్యలో భారత్‌కు ఒలింపిక్ 'పతకాలు'- ఇంకెప్పుడు?