ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో భారత్‌కు బంగారు పతకాన్ని సాధించి.. జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్డా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ విజేత.. బంగారు పతకం సాధించే కన్నా ముందు కొద్ది క్షణాలు కంగారు పడిపోయాడట. అయితే ఆ కంగారు ఆటపై ఒత్తిడి వల్ల కాదు. అసలు ఆటకే ప్రధానమైన జావెలిన్ వల్ల. ఈ విషయాన్ని నీరజ్ చోప్డానే స్వయంగా వెల్లడించాడు.
"జావెలిన్ త్రో ఫైనల్ ప్రారంభం కావడానికి కొద్ది క్షణాలే ఉంది. ఆ సమయంలో నా జావెలిన్ కనపడలేదు. దానిని కోసం వెతుకుతూ కంగారు పడ్డాను. ఇంతలో పాకిస్థానీ ఆటగాడు ఆర్షాద్ నదీమ్ చేతిలో నా జావెలిన్‌ను ఉండటం చూశాను. వెంటనే పరిగెత్తుకు వెళ్లి ఆ జావెలిన్ నాది ఇచ్చేయమని అడిగాను. దానితోనే త్రో చేయాల్సి ఉందని చెప్పాను. అతను నా జావెలిన్ ఇచ్చేశాడు. ఈ గందరగోళం వల్లే నేను మొదటిసారి జావెలిన్‌ను కంగారుగా విసిరాను."
-నీరజ్ చోప్డా, జావెలిన్ అథ్లెట్
అతనిలో సత్తా ఉంది..