తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామన్వెల్త్​ గేమ్స్​.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? - కామన్వెల్త్​ గేమ్స్ ఎప్పుడు మొదలైంది

Commonwealth Games 2022: మరో రోజులో బర్మింగ్​హమ్​ వేదికగా ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడలు గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం...

కామన్వెల్త్​ గేమ్స్​
What is common wealth games

By

Published : Jul 27, 2022, 6:52 PM IST

Commonwealth Games 2022: మరో రోజులో బర్మింగ్​హమ్​ వేదికగా ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభంకానున్నాయి. 72 దేశాలు, 25 రకాల క్రీడాలు.. ఐదు వేల మందికిపైగా అథ్లెట్లతో నిర్వహించబోతున్న ఈ మాహా క్రీడామేళా కోసం ఇప్పటికే పలు దేశాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ క్రీడలు ఎప్పుడు మొదలయ్యాయి? ఆ పేరెలా వచ్చింది? ఈ గేమ్స్​లో అత్యధిక పతకాలు గెలిచిన దేశం ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...

పేరు అలా వచ్చింది.. ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటన్​ పాలనలో ఉండేవి. ఆ దేశాలను అప్పుడు బ్రిటీష్​ ఎంపైర్​(సామ్రాజ్యం) అనేవారు. ఆ తర్వాత అవి స్వతంత్ర దేశాలుగా మారాయి. వాటినే నేడు కామన్వెల్త్​ దేశాలుగా పిలుస్తున్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం 53 దేశాలున్నాయి. కానీ ఈ కామన్వెల్త్​ క్రీడల్లో పాల్గొనబోయే దేశాలు 72.

అప్పుడు ప్రారంభయ్యాయి.. ఈ మెగా క్రీడలు 1930లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. మొదటిసారి హామిల్టన్​ నగరంలో నిర్వహించారు. అప్పుడు అప్పుడు మొత్తం 11 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, బెర్ముడా, బ్రిటీష్​ గయానా, కెనడా, ఇంగ్లాండ్​, నార్తర్న్​ ఐర్లాండ్​, న్యూజిలాండ్​, స్కాట్లాండ్, సౌత్​ ఆఫ్రికా, వేల్స్​ ఇందులో పాల్గొన్నాయి.

  • తొలి సారి జరిగిన పోటీల్లో ఆరు క్రీడాంశాలను మాత్రమే చేర్చాచు. అథ్లెటిక్స్​, బాక్సింగ్​, లాన్​ బౌల్స్​, రోయింగ్​, స్విమ్మింగ్​ అండ్​ డైవింగ్​, రెజ్లింగ్​.
  • కెనడాకు చెందిన ట్రిపుల్ జంపర్​ గోర్డాన్​ స్మాల్​కోంబ్​.. ఈ గేమ్స్​లో తొలిసారి స్వర్ణం గెలిచాడు.
  • ప్రతి నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ కామన్వెల్త్​ క్రీడలు 1942,1946లో నిర్వహించలేదు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత నుంచి వాయిదా వేయకుండా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సారి జరగబోయేది 22వ కామన్వెల్త్​ గేమ్స్​.
  • భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆ క్రీడల్లో 71 దేశాల నుంచి 6,081 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

గతంలో ఈ పేర్లతో పిలిచేవారు..

  • 1930 నుంచి 1950 వరకు బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్
  • 1954 నుంచి 1966 వరకు బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్
  • 1970 నుంచి 1974 వరకు బ్రిటీష్ కామన్వెల్త్ గేమ్స్
  • 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్​గా కొనసాగుతున్నాయి.

ఇంకొన్ని విషయాలు..

  • ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మిస్​ కాకుండా ఆరు దేశాలు మాత్రమే ఆడుతున్నాయి. వాటిలో ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​, స్కాట్లాండ్​, వేల్స్​. వీటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, కెనడా, న్యూజిలాండ్​.. ప్రతిసారి కనీసం ఓ గోల్డ్​మెడల్​ను అయినా దక్కించుకున్నాయి.
  • ఈ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా అత్యధిక పతకాలు గెలుచుకుంది. 2416 మెడల్స్​ను దక్కించుకుంది. ఇందులో 932 స్వర్ణాలు, 775 రజతాలు, 709 కాంస్య పతకాలున్నాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్​(2144), కెనడా(1555), భారత్​(503) రెండు, ముడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
  • 1930 నుంచి ఇప్పటివరకు ఈ కామన్వెల్త్​తో పలు క్రీడాంశాలను చేర్చారు. కొన్నింటిన తీశారు. కానీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అథ్లెటిక్స్​, డైవింగ్​, స్విమ్మింగ్​, రెజ్లింగ్​ మాత్రమే ఉన్నాయి.

ఇదీ చూడండి: ఐసీసీ కొత్త ఛైర్మన్​గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?

ABOUT THE AUTHOR

...view details