WFI President Suspension :సస్పెండ్ అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య- డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్తో భారత క్రీడా మంత్రిత్వశాఖ చర్చించే అవకాశం లేదని సమాచారం. క్రీడా శాఖ నిర్దేశించిన విధివిధానాలకు అనుసరించడానికి ఆయన అంగీకరించినా, సంజయ్ సింగ్ను తిరిగి అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేదని తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను తాత్కాలిక కమటీ నిర్వహిస్తుందని, అలాగే మరోసారి ఎన్నికలు నిర్వహించడానికి పనిచేస్తుందని క్రీడా శాఖ వర్గాల సమాచారం.
WrestlingFederation Of India President :అండర్ -15, అండర్ -20 రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ ఉత్తర్ప్రదేశ్ గోండాలోని నంది నగర్లో జరుగుతాయని తొందరపాటుగా ప్రకటించారు సంజయ్ సింగ్. దీంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ కొత్తప్యానెల్ను సస్పెండ్ చేసింది. అయితే పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్ల్యూఎఫ్ఐ నింబధనలకు విరుద్ధంగా ఇలా ప్రకటన చేసినందుకు క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం డబ్ల్యూఎఫ్ఐ క్యార్యకలాపాలు నిర్వహించేందుకు తాత్తాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్- ఐఓఏను ఆదేశించింది. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన ఐఓఏ, ఆ కమిటీకి ఛైర్మన్గా భుపిందర్ సింగ్ భజ్వాను నియమిస్తున్నట్లు ప్రకటించింది.