తెలంగాణ

telangana

WFI కొత్త చీఫ్​కు షాక్- సంజయ్ సింగ్ కార్యవర్గం సస్పెండ్- కారణం ఇదే!

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 11:28 AM IST

Updated : Dec 24, 2023, 12:38 PM IST

WFI Chief Sanjay Singh Suspended : డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్​కు షాక్ తగిలింది. కొత్తగా ఎన్నికైన సంజయ్​ సింగ్ కార్యవర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది.

WFI Chief Sanjay Singh Suspended
WFI Chief Sanjay Singh Suspended

WFI Chief Sanjay Singh Suspended :డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్​కు షాక్ తగిలింది. కొత్తగా ఎన్నికైన సంజయ్​ సింగ్ కార్యవర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది. అండర్ -15, అండర్ -20 రెజ్లింగ్ ఛాంపియన్​షిప్స్ ఉత్తర్​ప్రదేశ్​ గోండాలోని నంది నగర్​లో జరుగుతాయని తొందరపాటుగా ప్రకటించాడు. అయితే పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్ల్యూఎఫ్​ఐ నింబధనలకు విరుద్ధంగా ఇలా ప్రకటన చేసినందుకు క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

'భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ప్రవర్తించినందున సస్పెండ్ చేశాము. కానీ, ప్యానెల్​ను మేం రద్దు చేయలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా సస్పెన్షన్ కొనసాగుతుంది. వారు నియమ, నిబంధనలు అనురించాల్సి ఉంటుంది' అని క్రీడా శాఖ తెలిపింది.

కాగా, మాజీ అధ్యక్షుడు బ్రిజ్​భూషణ్ సింగ్​పై లైంగిక ఆరోపణలు వచ్చిన కారణంగా అతడ్ని బాధ్యతల నుంచి తప్పించి డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ప్యానెల్ భారీ మెజారిటీతో నెగ్గింది. అయితే కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్, బ్రిజ్​ భూషణ్​కు అత్యంత సన్నిహితుడైన కారణంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్​రంగ్ పూనియా సహా పలువురు అథ్లెట్లు అసహనం వ్యక్తం చేశారు.

Sakshi Malik Retirement: ఈ ఎన్నిక ఫలితాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు గుడ్​బై చెప్పింది. 'తాజా ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మేము మహిళా అధ్యక్షురాలిని కోరుకున్నాము కానీ అది జరగలేదు. అందుకే నేను రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నా' అంటూ సాక్షి భావోద్వేగానికి లోనైంది.

Bajrang Punia Padma Shri Return : సంజయ్ సింగ్ ఎన్నికను నిరసించిన స్టార్ రెజ్లర్ బజ్​రంగ్ పునియా అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును రీసెంట్​గా వెనక్కి ఇచ్చేశాడు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, ఈ నిర్ణయానికి గల కారణాలను వివరంగా అందులో పేర్కొన్నాడు.

బజ్​రంగ్​ పునియా కీలక నిర్ణయం- పద్మశ్రీ వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటన- మోదీకి లేఖ

'పద్మశ్రీ సహా అవార్డులన్నీ వెనక్కి ఇచ్చేస్తాం'.. ప్రభుత్వానికి రెజ్లర్ల వార్నింగ్​

Last Updated : Dec 24, 2023, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details