WFI Ad Hoc Committee :రెజ్లింగ్ సమాఖ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే కొత్త పాలక వర్గంపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర క్రీడాశాఖ తాజాగా రోజువారీ కార్యకలాపాల కోసం అడ్‌హక్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత ఒలింపిక్ సంఘం ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భూపిందర్ సింగ్ బజ్వా నేతృత్వం వహించనన్నారు. ఇతర సభ్యులుగా ఎంఎం సోమయా, మంజూష కన్వర్ నియమితులయ్యారు. జవాబుదారీతనంతో పాటు పారదర్శకత కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఓఏ ఓ ప్రకటనలో తెలిపింది.
"ఇటీవల ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశాం" అంటూ ఐఓఏ చీఫ్ పీటీ ఉష ఇటీవలే మీడియాకు వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే ?
WFI New President :ఇటీవలేనిర్వహించిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్‌కు పగ్గాలను అప్పజెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరికొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. అండర్-15, అండర్-20 జాతీయ రెజ్లింగ్ పోటీలను హడావుడిగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నందున వారికిపై ఈ వేటు పడింది. అయితే యంగ్ ప్లేయర్స్ క్రీడాకారులు తమ కెరీర్‌లో ఒక ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ పోటీలను త్వరగా నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ తెలిపారు.