తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు.. తొలి భారత బాక్సర్​గా ఆ ఘనత - ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌

మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పసిడి పట్టాడు తెలుగు కుర్రాడు గురునాయుడు. బాలుర 55 కేజీల ఈవెంట్‌లో మొత్తం 230 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

Youth World Champion
Weightlifter Gurunaidu Sanapathi

By

Published : Jun 13, 2022, 6:19 PM IST

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురునాయుడు (16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాలుర 55 కేజీల ఈవెంట్‌లో గురునాయుడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 230 కేజీల బరువు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇక సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్‌ 229 కేజీలతో రెండో స్థానంలో నిలవగా.. కజకిస్థాన్‌కు చెందిన్‌ ఉమ్రోవ్‌ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.

మరోవైపు బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య డాల్వి 148 కేజీల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీలో ఫిలీప్పీన్స్‌కు చెందిన జే రామోస్‌ 155 కేజీల బరువుతో తొలి స్థానం సాధించగా వెనుజులాకు చెందిన మాంటిల్లా 153 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:బీసీసీఐకి కాసుల పంట.. ఒక్క మ్యాచ్​కు రూ.107.5కోట్లు.. మీడియా హక్కులు ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details