తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కామన్వెల్త్​ గేమ్స్​​లో భారత్​ ఆడాలని కోరుకుంటున్నాం' - నిగెల్ ఆడమ్స్

2022 కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని కోరుకుంటున్నామని బ్రిటన్ క్రీడా మంత్రి నిగెల్ ఆడమ్స్​ అభిప్రాయపడ్డారు. టోర్నీలో షూటింగ్​ ఈవెంట్​ను తొలగించిన విషయంపై ఫెడరేషన్​కు లేఖ రాశామని ఆయన అన్నారు.

నిగెల్ ఆడమ్స్

By

Published : Aug 15, 2019, 4:00 PM IST

Updated : Sep 27, 2019, 2:44 AM IST

2022 బర్మింగ్​హామ్​ వేదికగా జరిగే కామన్వెల్త్​​ గేమ్స్​ నుంచి షూటింగ్​ను తీసివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన భారత ఒలింపిక్ సంఘం(ఐఓసీ) ఆ పోటీలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ క్రీడల్లో భారత్ పాల్గొనాలని కోరుకుంటున్నామని యూకే క్రీడామంత్రి నిగెల్ ఆడమ్స్ చెప్పారు.

"2022 బర్మింగ్​హామ్ కామన్వెల్త్​ గేమ్స్​లో భారత్​ పాల్గొనాలని మేము అనుకుంటున్నాం. షూటింగ్ ప్రాధాన్యతను, ప్రజల నమ్మకాన్ని అర్థం చేసుకోగలను. ఈ విషయంపై ఇప్పటికే కామన్వెల్త్​​ ఫెడరేషన్​కు లేఖ రాశాను. ఒకవేళ కుదరకపోతే షూటింగ్​ను ఛాంపియన్​షిప్​ రూపంలో తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాం" -నిగెల్ ఆడమ్స్​, బ్రిటన్ క్రీడామంత్రి.

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్ సత్తాచాటుతున్న వాటిలో షూటింగ్ ఒకటి. గోల్డ్​కోస్ట్​(ఆస్ట్రేలియా)లో జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్​​లో ఒక్క షూటింగ్ విభాగంలోనే 16 పతకాలు గెల్చుకుంది.

అదే విధంగా 2022 కామన్వెల్త్​ పోటీల్లో కొత్తగా మహిళా టీట్వంటీ క్రికెట్​ను, బీచ్ వాలీబాల్​, పారా టేబుల్ టెన్నిస్​ను ప్రవేశపెట్టనున్నారు.

ఇవీ చూడండి.. కామన్వెల్త్ క్రీడల్ని బహిష్కరిస్తామని భారత్ హెచ్చరిక

Last Updated : Sep 27, 2019, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details