టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లపై దేశం భారీ అంచనాలు పెట్టుకుందని తెలిపారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు. తాజా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఇండియా ప్లేయర్ల ఆటతీరుతో తమ నమ్మకాలకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు.
"ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం నుంచి వారి ప్రదర్శన బాగుంది. ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తుంది. వారి అవసరాలు తీరుస్తుంది."
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.
దిల్లీ వేదికగా జరుగుతున్న ప్రస్తుత షూటింగ్ వరల్డ్‌కప్‌లో 9 పసిడి, 5 వెండి, 5 కాంస్య పతకాలతో సత్తా చాటింది భారత్. మొత్తం 19 మెడల్స్‌తో.. పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
25 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్ని పతకాలను కైవసం చేసుకుంది భారత మహిళ షూటర్ల బృందం. ఈ విభాగంలో చింకీ యాదవ్ స్వర్ణం సాధించగా.. రాహీ సావంత్, మనూ బాకర్ వరుసగా వెండి, కాంస్య పతకాలు సాధించారు.
పురుషుల విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
ఇదీ చదవండి:25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత్ క్లీన్‌స్వీప్