తెలంగాణ

telangana

ETV Bharat / sports

వారెవ్వా ఇక్రామ్.. చేతుల్లేకపోయినా​ ఆడేస్తున్నాడు

రెండు చేతులు లేకపోయినా సరే స్నూకర్​ ఆడి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు పాక్​కు చెందిన మహ్మద్​ ఇక్రామ్. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు.

snooker
స్నూకర్

By

Published : Oct 26, 2020, 7:47 PM IST

వారెవ్వా.. చేతుల్లేకపోయినా స్నూకర్​ ఆడేస్తున్నాడు

సంకల్పం గట్టిదైతే వైకల్యం అడ్డు రాదని, ఏదైనా సాధించొచ్చని పాకిస్థాన్​కు చెందిన దివ్యాంగుడు మహ్మద్​ ఇక్రామ్ నిరూపిస్తున్నాడు. ​​పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా.. స్నూకర్​ను గడ్డం(దవడ ముందు భాగం)తో ఆడి ఔరా అనిపిస్తున్నాడు.

పాకిస్థాన్​ పంజాబ్​కు చెందిన ఇక్రమ్​కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చిన్నప్పటి నుంచి స్నూకర్​ అంటే అమితమైన ఇష్టం. తోటి వయసు పిల్లలంతా ఇండోర్​ గేమ్స్​ ఆడుతుంటే తనకు ఆడాలనిపించేది. దీంతో అందరిలా తనకిష్టమైన స్నూకర్​ను ఆడాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు. ఇంటికి దగ్గరలో ఉన్న స్నూకర్​ క్లబ్​కు రోజూ వెళ్లి గడ్డంతో శిక్షణ చేస్తుండేవాడు. చుట్టుపక్కన్న వారు హేళన చేస్తున్నా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలానే శిక్షణ కొనసాగించాడు. క్రమ క్రమంగా స్థానికంగా జరిగే పోటీల్లో పాల్గొని.. ఇప్పటి వరకు మూడు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతడి ఆట పాక్ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. హేళన చేసిన వారే ఇప్పుడు తనను పొగుడ్తున్నారు.

విదేశాల్లోనూ ఆడి గొప్ప ఆటగాడిగా ఎదగడమే తన లక్ష్యమని ఇక్రామ్ చెప్పాడు​. ప్రభుత్వం తనకు అండగా నిలవాలని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు​ విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​: బ్యాట్స్​మెన్​ దెబ్బకు బలైన బౌలర్లు!

ABOUT THE AUTHOR

...view details