దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో.. 'వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు'ను స్థాపించనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మహారాష్ట్ర పుణేలో, శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో.. 'ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను మంత్రి ప్రారంభించారు.
2028 ఒలింపిక్స్‌లో భారత్ టాప్-10లో ఉండాలనేది మా లక్ష్యం. అందుకు క్షేత్ర స్థాయి నుంచి క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. దేశంలో సుమారు 700 జిల్లాలున్నాయి. అంటే జిల్లాకు ఒక కేంద్రం తప్పక వస్తుంది. ఇంకొన్ని జిల్లాల్లో అంతకుమించి వచ్చే అవకాశం ఉంది.