దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న మాజీ అథ్లెట్లు, కోచ్‌లను అండగా ఉందేందుకు సిద్ధమైంది కేంద్ర క్రీడా శాఖ. వైరస్ కారణంగా వైద్య, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వీరిని ఆదుకునేందుకు ఓ మంచి కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, శాయ్, భరత ఒలింపిక్ సంఘం(ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. వీరికోసం ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ పేరు ఇందులో నమోదు చేసుకోగానే తక్షణమే స్పందించి వారికి సాయం చేసేందుకు కృషి చేస్తారు.
కష్టాల్లో ఉన్న మాజీ అథ్లెట్లను ఆదుకుంటాం: రిజిజు - కరోనా అథ్లెట్స్
ప్రస్తుతం కొవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్‌లను ఆదుకునేందుకు కేంద్ర క్రీడాశాఖ, శాయ్, ఐఓసీ కలిసి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా వారికి ఆర్థిక చేయూత అందించనున్నాయి.
రిజిజు
ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు, ఐఓసీ నరీందర్ ధ్రువ్ బత్రా. క్రిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి మాజీ అథ్లెట్, కోచ్‌లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ పర్యటనకు భారత క్రికెటర్లు కుటుంబంతో సహా!