గత కొద్ది కాలంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్ ఆరోపణలతో అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా). నాలుగేళ్ల పాటు ఏ టోర్నీలోనూ పాల్గొనకుండా రష్యాపై వేటు వేసింది.
ఈ కారణంగా వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కూ దూరం కానుంది రష్యా. స్విట్జర్లాండ్ వేదికగా సోమవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు వాడా బోర్డు సభ్యులు.
మాస్కోలోని యాంటీ డోపింగ్ లేబరేటరీలో వివరాలు తారుమారుచేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు వాడా బోర్డు సభ్యులు. ఏళ్ల తరబడి అంతర్జాతీయ క్రీడల్లో రష్యా మోసపూరితంగా వ్యవహరిస్తుందని, ఇందుకు శిక్షతప్పదని ఏకగ్రీవంగా తీర్మానించారు.