చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కె.విశ్వనాథన్ (92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దక్షిణ రైల్వేకు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఈయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.
చెస్ ఛాంపియన్ ఆనంద్ తండ్రి కన్నుమూత - చెస్ ఛాంపియన్ ఆనంద్ తండ్రి కన్నుమూత
చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్ అనారోగ్యం కారణంగా కన్నమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
విశ్వనాథన్ ఆనంద్
ఈ విషయాన్ని ఆనంద్ భార్య అరుణ వెల్లడించారు. అలాగే ఆయన ఆనంద్ కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
"ఆనంద్‌కు ఆయన గొప్ప మద్దతు ఇచ్చేవారు. ఆనంద్ ఛాంపియన్ షిప్ గెలుపు సంబరాన్ని ఆయన వీక్షించారు. ఆయనొక సాధారణ వ్యక్తి" అని తెలిపారు అరుణ.