తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రొయేషియా రాపిడ్​ ఈవెంట్లో ఆనంద్​కు ఓటమి - చెస్‌

క్రొయేషియా గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నీ ర్యాపిడ్‌ ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్​ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓటమి పాలయ్యాడు. తొమ్మిదో రౌండ్లో డచ్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీష్‌ గిరి అతణ్ని 51 ఎత్తుల్లో ఓడించాడు.

Viswanathan Anand
విశ్వనాథన్‌ ఆనంద్‌

By

Published : Jul 10, 2021, 9:05 AM IST

క్రొయేషియా గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నీ ర్యాపిడ్‌ ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తొమ్మిదో రౌండ్లో ఓటమి ఎదుర్కొన్నాడు. డచ్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్​ గిరి అతణ్ని 51 ఎత్తుల్లో ఓడించాడు. అంతకుముందు వరుసగా రెండు రౌండ్లలోనూ ఆనంద్‌కు డ్రాలు ఎదురయ్యాయి.

క్రొయేషియా గ్రాండ్‌మాస్టర్‌ ఇవాన్‌ సారిక్‌తో ఎనిమిదో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన ఆనంద్‌.. 48 ఎత్తుల వద్ద డ్రాకు అంగీకరించాడు. అంతకుముందు ఏడో గేమ్‌లో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాన్‌ క్రిస్టోఫ్‌ జుడాతో అతను పాయింట్లు పంచుకున్నాడు. ఈ గేమ్‌ 74 ఎత్తుల్లో ముగిసింది.

ఇవీ చదవండి:చదరంగంలో 'అతిపిన్న' అభిమన్యుడు

ABOUT THE AUTHOR

...view details