'లెజెండ్ ఆఫ్ చెస్' ఆన్లైన్ టోర్నీలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాడు ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. తద్వారా పోటీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన చివరి రౌండ్లో ఉక్రెయిన్‌కు చెందిన వాసిల్ ఇవాన్చుక్పై ఓటమిపాలై, తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు.
టోర్నీ ప్రారంభంలోనే తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్సెన్.. వ్లాదిమిర్ క్రామ్నిక్‌ను 3-1 తేడాతో ఓడించి 'ఆల్-విన్' రికార్డుతో ముగించాడు. సెమీస్‌లోని ఓ మ్యాచ్‌లో నార్వేజియన్, రష్యాకు చెందిన పీటర్ స్విడ్లర్ ఆడనుండగా.. మరో మ్యాచ్‌లో అనీష్ గిరి(హంగేరీ) ఇయాన్ నెపోమ్నియాచ్ట్చి (రష్యా) తలపడనున్నారు. లెజెండ్స్ ఆఫ్ చెస్ టోర్నీలో చెస్సబుల్ మాస్టర్స్‌లో సెమీఫైనలిస్టులైన కార్ల్సన్, లిరెన్, నెపోమ్నియాచ్ట్చి, గిరి ప్రత్యక్షంగా ఇందులో ఆహ్వానాన్ని అందుకున్నారు. వీరందరూ వారి చెస్ కెరీర్‌లోని ఏదో సమయంలో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచినవారే. లెజెండ్ ఆఫ్ చెస్ టోర్నీ.. మాగ్నస్ కార్ల్సెన్ చెస్ టూర్లో భాగం. దీని విజేత ఆగస్టు 9 నుంచి 20 వరకు జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాడు.
తుది స్టాండింగ్‌లు:
1) కార్ల్సెన్ (25 మ్యాచ్ పాయింట్లు)
2) నెపోమ్నియాచ్ట్చి (20 పాయింట్లు)
3) అనీష్ గిరి (18 పాయింట్లు)