Viswanathan Anand beats Magnus Carlsen: దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నమెంట్లో జోరు కొనసాగిస్తున్నాడు. అతడు వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. సోమవారం జరిగిన క్లాసికల్ ఐదో గేమ్‌లో ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్లెసన్ ఓడించాడు. రెగ్యులర్ మ్యాచ్ 40ఎత్తుల్లో డ్రాగా ముగియగా ఆర్మాగెడాన్ నిర్వహించారు. ఇందులో ఆనంద్ విజయం సాధించాడు. ఈ విజయంతో ఆనంద్.. పది పాయింట్లతో అగ్రస్థానంలోకి రాగా, కార్లెసన్ 9.5పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఆనంద్ జోరు.. ఐదో రౌండ్లో ప్రపంచ నెం.1పై గెలుపు - విశ్వనాథ్ ఆనంద్ నార్వే చెస్‌లో విజేతగా
Viswanathan Anand beats Magnus Carlsen: నార్వే చెస్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన ఐదో రౌండ్లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ విజయం సాధించాడు. ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్లెసన్ను ఓడించాడు.

విశ్వనాథ్ ఆనంద్
కాగా, ఈ టోర్నీలో తొలి మూడు రౌండ్లలో మాక్సిమ్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), వెస్లిన్ తపలోవ్ (బల్గేరియా), విషీ వాంగ్ హోను(చైనా) ఓడించాడు. అయితే నాలుగో రౌండ్లో అమెరికా ఆటగాడు వెస్లీ సో చేతిలో ఓటమి చెందాడు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ పోటీల్లో తెలుగమ్మాయి జ్యోతికకు స్వర్ణం