తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టుల పరిస్థితే క్లాసికల్​ చెస్​కు ఎదురుకావచ్చు' - test cricket classical chess

ర్యాపిడ్​ గేమ్​ విస్తృతం కావడం వల్ల క్లాసికల్​ చెస్​ ఆదరణ రోజురోజుకు తగ్గుతుందని విచారం వ్యక్తం చేశాడు భారత చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్​. త్వరలోనే తాను ఓ అకాడమీని స్థాపించనున్నట్లు వెల్లడించాడు. ప్రతిభావంతులను ఆర్థికంగా ఆదుకుని శిక్షణ ఇవ్వడం తన అకాడమీ లక్ష్యమని చెప్పాడు.

viswanathan
విశ్వనాథన్​ ఆనంద్​

By

Published : Dec 25, 2020, 6:36 AM IST

క్రికెట్లో టెస్టు మ్యాచులకు రానురాను ఆదరణ తగ్గినట్లుగానే చెస్‌లో క్లాసికల్‌ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గొచ్చని భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. త్వరలో తాను ఓ అకాడమీని స్థాపించబోతున్నట్లు వెల్లడించాడు.

"ర్యాపిడ్‌ గేమ్‌ విస్తృతం కావడం వల్ల క్లాసికల్‌ చెస్‌కు రోజు రోజుకు ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. క్రికెట్లో టెస్టు మ్యాచులకు ఉన్న పరిస్థితే ఇప్పుడు క్లాసికల్‌ చెస్‌కు ఎదురుకావచ్చు. మా తరం వాళ్లకు ఇది చాలా నిరాశ కలిగించే విషయం. కానీ ఒక్కో తరం వాళ్లు ఆటను భిన్న కోణంలో చూస్తారు. క్లాసికల్‌ చెస్‌లో కొన్ని లోపాలున్నాయని మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఒక ప్రపంచ ఛాంపియన్‌ ఇలా చెప్పడమే మింగుడుపడని విషయం. ఇందులో మాగ్నస్‌ను పూర్తిగా తప్పుబట్టలేం. కానీ క్లాసికల్‌ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చడానికి మార్గాలు కనుక్కోవాలి. రాబోయే రోజుల్లో ఎన్ని టోర్నీలు క్లాసికల్‌ విభాగంలో జరుగుతాయనేది ప్రశ్నార్థకం. ఏదేమైనా క్లాసికల్‌ చెస్‌కు ఒకప్పటి రోజులు మళ్లీ రావు. త్వరలో ఒక అకాడమీ మొదలుపెట్టబోతున్నా. 1960లో మైకేల్‌ బోట్వినిక్‌ చెస్‌ అకాడమీనే ఇందుకు స్ఫూర్తి. తన అనుభవాన్ని భావి తరాలకు అందించాలని అతను భావించాడు. మైకేల్‌ పెట్టిన అకాడమీలోనే అనతోలి కార్పోవ్‌ లాంటి ఆటగాడు బయటకొచ్చాడు. ప్రతిభావంతులకు ఆర్థికంగా ఆదుకుని శిక్షణ ఇవ్వడం నా అకాడమీ లక్ష్యం. నేను ఎంచుకున్న క్రీడాకారులంతా అండర్‌-17 వయసులోపు వాళ్లే. నిహాల్‌ సరీన్‌, ప్రజ్ఞానంద, వైశాలి లాంటి వాళ్లు ఇందులో ఉన్నారు" అని విషీ చెప్పాడు.

ఇదీ చూడండి : డోపింగ్​ పరీక్షల్లో విఫలం.. రెండేళ్ల నిషేధం

ABOUT THE AUTHOR

...view details