ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ జర్మనీలో ఓ పట్టణంలో చిక్కుకుపోయాడు భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అంతర్జాతీయ చెస్ టోర్నీల్లో పాల్గొనేందుకు ఐరోపా వెళ్లి జర్మనీలోని బాడ్ సోడెన్ అనే చిన్న పట్టణంలో రెండు నెలలుగా ఉంటున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే.. తాను ఇప్పుడిప్పుడే స్వస్థలం చెన్నైకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదని.. ఇప్పుడున్న చోటే ఇంకొన్ని నెలలు ఉండటానికి మానసికంగా సిద్ధపడిపోయానని ఆనంద్ తెలిపాడు.
"నేను ఇక్కడే ఇంకొంత కాలం ఉండాల్సిందే. జర్మనీలో లాక్‌డౌన్ ఇప్పుడిప్పుడే ఎత్తివేసేలా కనిపించడం లేదు. మళ్లీ విమాన ప్రయాణాలు మొదలైనా.. నేరుగా చెన్నై చేరుకునే అవకాశం ఉంటేనే ఇక్కడి నుంచి బయల్దేరతాను. ఎందుకంటే మధ్యలో మరో చోట చిక్కుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి అన్ని ఆంక్షలూ తొలగిపోవాలి.