అమెరికా దిగ్గజ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రాయాంట్.. ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అతడి కుమార్తెతో సహా మరో ఎనిమిది మంది మృతి చెందారు. మంటల్లో చిక్కుకోవడం వల్ల మృతదేహలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. బ్రియంట్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అతడికి సంతాపం చెబుతున్నారు.
"కాలిఫోర్నియాలోని హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రాయాంట్తో పాటు మరొకొంత మంది మరణించారని తెలిసింది. ఇది ఎంతో భయంకరమైన వార్త" అని ట్రంప్ ట్వీట్ చేశారు. బాస్కెట్‌బాల్‌లో కోబ్ ఓ లెజెండ్ అని, కోబ్‌తో పాటు అతడి కుమార్తె గియానా ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరమని ఒబామా విచారం వ్యక్తం చేశారు. అమెరికన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్‌బీఏకు తీరని లోటని తెలిపింది.