Viral Video WWE Superstars Dance For Naatu Naatu Song: నాటు నాటు పాట ప్రపంచాన్నే ఊపేస్తోంది. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 18 నెలలు అయినా ఊపు ఏ మాత్రం తగ్గలేదు. ఆ సాంగ్ లోని బీట్స్‌కు.. ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులు ఎంతో మంది ప్రముఖులను కూడా ఆకట్టుకున్నాయి. దానికి చాలా మంది డ్యాన్సులు కూడా చేశారు. మరికొద్దిమంది రీల్స్, షాట్స్.. ఇలా తమకు నచ్చిన రీతిలో డ్యాన్సులు వేసి సోషల్ మీడియా వేదికగా వాటిని పంచుకున్నారు. తాజాగా ఈ పాటకు WWE రెజర్లు డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుంభాలు కుంభాలు తినడం.. భారీగా కండలు పెంచడం.. వీరావేశంతో రింగులో కొట్టుకోవడం.. కసితో ప్రత్యర్థులను ఓడించడంలో ఎప్పుడూ బిజీగా ఉండే WWE రెజ్లర్స్ తాజాగా రింగులో డ్యాన్స్ చేశారు. అది కూడా ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తెలుగోడి బీటు.. నాటు నాటుకు.. తమ స్టైల్లో నాట్యం చేశారు. ఇంకేముంది షో లో ఒకటే ఈలలు, గోలలు, అరుపులు. షో చూస్తున్న అందర్నీ అరిపించడంతో.. తమ నాటు స్టెప్పులతో నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నారు. తమ అభిమాన ఫైటర్లు అందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసి డ్యాన్స్ చేయడం చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చప్పట్లతో వేదిక మొత్తం దద్దరిల్లింది. ఎప్పుడూ టీవీల్లో కనిపించే WWE స్టార్స్.. దాదాపు 17 ఏళ్ల సంవత్సరాల భారతదేశానికి వచ్చారు.
'నాటు నాటు' సాంగ్.. ఈ ఆసక్తికర విషయాలను మీరు గమనించారా?
WWE Superstars Dance For Naatu Naatu Song in Hyderabad:ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. . హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా జరుగుతున్న WWE సూపర్ స్టార్ స్పెక్టేకిల్ తొలి మ్యాచ్‌లో భారత స్టార్ రెజ్లర్లు వీర్ మహాన్, సంగా, జిందర్ మహాల్ పాల్గొన్నారు. వీరితో వెటరన్ స్టార్లు కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, డ్రూ మెకింటైర్ పోటీపడ్డారు. అనంతరం నలుగురి మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్.. హైడ్రామాతో ఆరుగురి మధ్య పోటీగా మారింది. ఈ మ్యాచ్‌లో డ్రూ, కెవిన్, ఓవెన్స్ జోడీ విజయం సాధించింది. ఆ తర్వాతే అసలు మజా మొదలైంది. మ్యాచ్ తర్వాత ఆరుగురు రెజ్లర్లు తమ గెలుపోటములు పక్కన పెట్టి డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ క్రమంలో ముగ్గురు స్టార్లు కలిసి ఆస్కార్ అందుకున్న 'నాటు.. నాటు..' పాటకు కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో డ్రూ టీమిండియా జెర్సీ వేసుకొని వచ్చి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు కూడా.
కాగా నాటు నాటు పాట విషయానికి వస్తే.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమపాటగా మార్చి 13న ఆస్కార్ అవార్డు అందుకుంది. తెలుగు సినిమా పాట ప్రపంచ యవనికపై సగర్వంగా తల ఎత్తుకు నిలబడింది..
హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు
'నాటు నాటు'కు దక్కిన అంతర్జాతీయ అవార్డులెన్నో తెలుసా?