తెలంగాణ

telangana

ETV Bharat / sports

వలస కార్మికులతో ఫుట్‌బాల్‌ ఆడిన నెదర్లాండ్స్‌ జట్టు.. వీడియో వైరల్ - undefined

ఫిఫా వరల్ట్​ కప్​కోసం అన్ని జట్లు ప్రాక్టీస్​లో మునిగితేలుతున్నాయి. అయితే నెదర్లాండ్స్ ఫుట్‌బాల్‌ టీమ్ మాత్రం తమ ట్రైనింగ్ సెషన్‌కు వలస కార్మికులను ఆహ్వానించింది. వారితో సరాదాగా కాసేపు ఆడింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

netherlands
netherlands

By

Published : Nov 19, 2022, 9:44 AM IST

ఫిఫా వరల్డ్ కప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ఖతార్​లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌ ఫీవర్ మొదలైంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో వేగం పెంచాయి. అయితే నెదర్లాండ్స్ ఫుట్‌బాల్‌ టీమ్ మాత్రం తమ ట్రైనింగ్ సెషన్‌కు వలస కార్మికులను ఆహ్వానించింది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వాళ్లంతా ఖతర్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న స్టేడియం నిర్మాణంలో పాలుపంచుకున్న వలస కూలీలు. స్టేడియానికి కొత్త హంగులు అద్దడం కోసం వీళ్లు గంటల కొద్దీ కష్టపడ్డారు. వలస కూలీల శ్రమకు గుర్తింపుగా నెదర్లాండ్స్‌ ఫుట్‌బాల్ టీమ్ వాళ్లను తమ ప్రాక్టీస్ సెషన్‌కు పిలిచింది. అంతేకాదు వాళ్లతో కలిసి నెదర్లాండ్స్ ఆటగాళ్లు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.

For All Latest Updates

TAGGED:

netherlands

ABOUT THE AUTHOR

...view details