తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫొగాట్​​కు కరోనా నెగటివ్​.. అయినా ఐసోలేషన్​లోనే!

మంగళవారం తనకు రెండోసారి జరిపిన కరోనా పరీక్షల్లో నెగటివ్​గా నిర్ధరణ అయ్యినట్లు భారత మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ తెలిపింది. వైరస్​ బారి నుంచి విముక్తి లభించినా.. తగిన జాగ్రత్తలు వహిస్తానంటూ ట్వీట్ చేసింది.

Vinesh Phogat tests negative for COVID-19, to remain under isolation
వినేశ్​ ఫొగాట్​కు కరోనా నెగటివ్​.. అయినా ఐసోలేషన్​లోనే!

By

Published : Sep 2, 2020, 8:07 AM IST

Updated : Sep 2, 2020, 8:17 AM IST

భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్​కు ఇటీవలే చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్​​గా తేలింది. గత నెల 28న కరోనా బారిన పడిన వినేశ్​కు మంగళవారం జరిపిన టెస్టుల్లో వైరస్​ లేదని నిర్ధరణ అయినట్లు ట్వీట్​ చేసింది.

"మంగళవారం రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్నప్పుడు నెగటివ్​గా తేలింది. ఈ పరిస్థితిలోనూ ఐసోలోషన్​లో ఉంటూ జాగ్రత్త చర్యలు పాటిస్తాను. నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు"

- వినేశ్​ ఫొగాట్​, భారత మహిళా రెజ్లర్​

స్వస్థలం సోనీపత్​​లో కోచ్ ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్​ కోసం వినేశ్ శిక్షణ తీసుకుంటోంది. ఈ సమయంలో కరోనా వచ్చినట్లు తేలింది. గతంలో ఈమె ఆసియా క్రీడలు, కామన్వెల్త్​ గేమ్స్​లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.

గతనెల 28వ తేదీన వినేశ్​ ఫొగాట్​కు కరోనా వైరస్​ సోకినట్లు ప్రకటించింది. జాతీయ క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు ఎంపికైన ఈమె.. వైరస్ సోకిన కారణంగా అవార్డుల ప్రదానోత్సవానికి దూరంగా ఉంది. ఈ వేడుకను వర్చువల్​గా నిర్వహించి గ్రహీతలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా పురస్కారాలను అందించారు.

Last Updated : Sep 2, 2020, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details