తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్షమాపణలు చెప్పిన రెజ్లర్ వినేశ్​ ఫొగాట్ ​ - wfi

తనపై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తీసుకున్న తాత్కాలిక నిషేధానికి బదులిచ్చింది రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ (Vinesh Phogat). ఈ మెయిల్​ ద్వారా క్షమాపణలు కోరింది. ఆమె సమాధానంతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందా లేదా అనే తెలియాల్సి ఉంది.

vinesh phogat
వినేశ్ ఫొగాట్

By

Published : Aug 15, 2021, 4:51 PM IST

భారత స్టార్ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ (Vinesh Phogat)​ భారత రెజ్లింగ్ సమాఖ్యను (డబ్ల్యూఎఫ్​ఐ) (WFI) క్షమాపణలు కోరింది. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​లో అమర్యాదగా ప్రవర్తించినందుకు గానూ ఆమెపై చర్యలు తీసుకుంది డబ్ల్యూఎఫ్​ఐ.

"వినేశ్​ ఒక ఈ-మెయిల్​ పంపింది. క్రమశిక్షణ కమిటీ ఆమె అభ్యర్థనను పరిశీలించనుంది. ఆమె సమాధానంతో కమిటీ సంతృప్తి చెందిందా లేదా అనేది చూడాల్సి ఉంది" అని డబ్ల్యూఎఫ్​ఐలోని వర్గాలు వెల్లడించాయి.

ఒలింపిక్స్​కు ముందు ప్రాక్టీస్​ కోసం కోచ్​ వోల్లర్​ అకోస్​తో కలిసి హంగేరీ వెళ్లింది వినేశ్. ఈవెంట్​ సమయానికి టోక్యోకు చేరుకున్న ఆమె.. ఇతర భారత అథ్లెట్లతో కలిసి ఉండటానికి, ప్రాక్టీస్ చేయడానికి నిరాకరించింది. ఈ విషయంపై ఆమెను తాత్కాలికంగా సస్పెండ్​ చేసింది డబ్ల్యూఎఫ్​ఐ. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆమెకు ఆగస్టు 16 వరకు గడువును కేటాయించింది.

ABOUT THE AUTHOR

...view details