24వ ఉక్రేనియన్ రెజ్లర్స్ అండ్ కోచ్‌ల స్మారక టోర్నీ 53 కేజీల విభాగంలో ఫైనల్లో భారత రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అడుగుపెట్టింది. 53 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీఫైనల్లో రొమేనియాకు చెందిన అనాపై 2-0 పాయింట్లతో నెగ్గిన వినేశ్.. తుదిపోరుకు అర్హత సాధించింది.
ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ - వినేశ్ ఫొగాట్
ఉక్రెయిన్ వేదికగా జరుగుతోన్న రెజ్లర్స్ అండ్ కోచ్‌ల స్మారక టోర్నీ ఫైనల్‌కు భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేరింది. శనివారం జరిగిన సెమీస్‌లో రొమేనియా రెజ్లర్ అనాపై నెగ్గి.. ఆదివారం జరగనున్న తుదిపోరులో ప్రపంచ మాజీ ఛాంపియన్ వెనెసాతో తలపడనుంది.
ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో వినేశ్ ఫొగాట్
ఈ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెజ్లింగ్ మాజీ ఛాంపియన్ వెనెసా కలాడ్జిన్స్కాయపై ఆదివారం తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో ఇప్పటికే అర్హత సాధించిన వినేశ్ ఫొగాట్.. గతేడాది నవంబరు నుంచి యూరప్‌లో రెజ్లింగ్ శిక్షణ పొందుతోంది.
ఇదీ చూడండి:స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో దీపక్‌కు రజతం