తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రిజ్‌ భూషణ్‌పై సుప్రీంకు రెజ్లర్లు.. ఎన్నికలు వాయిదా - బ్రిజ్​ భూషణ్​పై కేసు నమోదు

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కిన స్టార్‌ రెజ్లర్లు.. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రంకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మే 7వ తేదీన జరగనున్న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Wrestlers
రిజ్‌ భూషణ్‌పై సుప్రీంకు రెజ్లర్లు.. ఎన్నికలు వాయిదా

By

Published : Apr 24, 2023, 3:14 PM IST

Updated : Apr 24, 2023, 3:45 PM IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ మళ్లీ రోడెక్కిన స్టార్ రెజ్లర వివాదం మరింత ముదిరింది. వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఏడుగురు రెజ్లర్లు.. తమ సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వీరిలో వినేశ్‌ ఫొగాట్‌ కూడా ఉన్నారు. తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ.. బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయడంలో.. పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. అలానే బ్రిజ్​ భూషణ్​పై ఫిర్యాదు చేసిన వారిలో మైనర్‌ కూడా ఉండడంతో.. కేసులో పోక్సో చట్టాన్ని కూడా చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ పిటిషన్‌ను మంగళవారం(ఏప్రిల్​ 25) లిస్ట్‌ చేయాలని రెజ్లర్ల తరఫు న్యాయవాదికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సూచించినట్లు తెలిసింది.

ఎలెక్షన్స్ పోస్ట్​పోన్​..ఈ వివాదం నేపథ్యంలో మే 7వ తేదీ నిర్వహించాల్సిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలను పోస్ట్​పోన్​ చేశారు. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ సమాఖ్యతో పాటు కేంద్ర క్రీడాశాఖ కూడా ప్రకటించింది.

ఇలా అవమానిస్తారా?..ఆదివారం(ఏప్రిల్ 23) నుంచిబజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌ సహా పలువురు స్టార్​ రెజ్లర్లు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రి కూడా వారు దీక్షలోనే ఉన్నారు. ఫుట్‌పాత్‌పైనే శిబిరం వద్ద నిద్రించారు. దీనికి సంబంధించిన ఫొటోను దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. "విదేశీ గడ్డపై మన త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించిన వారిని.. ఈ రోజు ఇలా అమానించడం న్యాయమా?" అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించారు.

కాగా, బ్రిజ్‌ భూషణ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే రెజ్లర్స్ రోడెక్కారు. దీంతో రంగంలోకి దిగిన సెంట్రల్​ గవర్న్​మెంట్​.. దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసేందుకు ఆదేశించింది.అయితే ఆ పర్యవేక్షక కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసి.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికను కేంద్రం బయటపెట్టలేదు. అలాగే బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెజ్లరు ఇప్పుడు మరోసారి ధర్నా చేయడం ప్రారంభించారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆదివారం నుంచి దీక్ష చేస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్​ చేశారు. కానీ, ఇంతవరకూ పోలీసులు ఆయనపై కేసు చేయకపోవడంతో రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:WFI ప్రెసిడెంట్​ రాజీనామాకు భారత రెజ్లర్ల డిమాండ్​.. ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌?

Last Updated : Apr 24, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details