తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​ పతక విజేతను ఓడించిన వినీశ్ ఫొగాట్ - World Championships in Kazakhstan

కజకిస్థాన్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీల్లో భారత్​ రెజ్లర్​ వినీశ్​ ఫొగాట్​ సత్తాచాటింది. మెుదటి రౌండ్​లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక గ్రహీత సోఫియా మ్యాట్సన్​(స్వీడన్​)​ను ఓడించి శుభారంభం చేసింది.

వినీశ్ ఫొగాట్

By

Published : Sep 17, 2019, 12:46 PM IST

Updated : Sep 30, 2019, 10:40 PM IST

ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​​షిప్​లో భారత స్టార్​ రెజ్లర్​ వినీశ్​ ఫొగాట్​ శుభారంభం చేసింది. 53కేజీల విభాగంలో ఈ రెజ్లర్ ఒలింపిక్స్​ కాంస్య విజేత సోఫియా మ్యాట్సన్(స్వీడన్​)​ను తొలి రౌండ్​లో ఓడించింది. 13-0 తేడాతో గెలిచి రెండో రౌండ్​కు అర్హత సాధించింది వినీశ్.

ఈ ఏడాదే 50 నుంచి 53 కేజీల విభాగానికి మారిన వినీశ్ వరుస టైటిల్స్​తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు టోర్నీల్లో ఫైనల్స్​ చేరి మూడు స్వర్ణాలు నెగ్గింది. యాజర్ డోగు, స్పెయిన్ గ్రాండ్ పిక్స్​, పొలాండ్ ఓపెన్​లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది.

ఈ నెల14 నుంచి 22 వరకు నుర్​సుల్తాన్​(కజికిస్థాన్​)లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో మెుదటి ఆరు స్థానాల్లో నిలిచిన రెజ్లర్లు 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తారు.

ఇదీ చూడండి: 'ధోనీ రిటైర్మెంట్​ విషయాన్ని వారే తేల్చాలి'

Last Updated : Sep 30, 2019, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details