తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజేందర్​ X స్నైడర్.. సూపర్​ ఫైట్​కు సర్వం సిద్ధం - mike snider

భారత బాక్సర్ విజేందర్ సింగ్ అమెరికాలో మ్యాచ్ ఆడనున్నాడు. ఆ దేశానికి చెందిన మైక్ స్నైడర్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఆదివారం ఉదయం 4 గంటలకు భారత్​లో ప్రత్యక్షప్రసారం కానుంది ఈ పోరాటం.

విజేందర్

By

Published : Jul 12, 2019, 5:42 PM IST

భారత స్టార్ బాక్సర్ విజేందర్​ సింగ్ అమెరికాకు చెందిన మైక్ స్నైడర్​ను ఢీ కొట్టనున్నాడు. యూఎస్​లో తొలి మ్యాచ్​ ఆడనున్న విజేందర్​ శనివారం మైక్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 8 రౌండ్లు జరగనున్న ఈ పోటీ భారత్​లో ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

"ఇది మంచి పోటీ అవుతుందనుకుంటున్నా. ఈ ఏడాది ఇంకో రెండు పోట్లీల్లో పాల్గొంటా. నా ప్రత్యర్థి ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉంది. శనివారం జరగబోయే మ్యాచ్​లో వ్యూహాలపై మా కోచ్ లీ బియర్డ్​తో చర్చించా. తొలి రౌండ్లోనే అతడిని నాకౌట్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నా" -విజేందర్ సింగ్, భారత బాక్సర్​

మైక్ స్నైడర్​ కూడా ఈ మ్యాచ్​ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. 21 బౌట్లు ఆడిన స్నైడర్ 13-5-3 రికార్డుతో జోరు మీదున్నాడు. భారత బాక్సర్​ను ఓడిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

"నేను విజేందర్ సింగ్ ఫైట్లు చూశాను. అతడి బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను గెలవలేను అని అన్నప్పుడల్లా గెలిచి చూపించాను. వారి(ప్రజల) అంచనా తప్పని చూపించడం నాకిష్టం. విజేందర్​పై తప్పకుండా గెలుస్తా" - మైక్ స్నైడర్​, అమెరికా బాక్సర్​

ప్రొఫెషనల్ కెరీర్లో 10 బౌట్లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించాడు విజేందర్​ సింగ్​. ఇందులో ఏడు నాకౌట్లు ఉన్నాయి. దాదాపు ఏడాది విరామం తర్వాత రింగులోకి అడుగుపెట్టనున్నాడు విజేందర్.

ABOUT THE AUTHOR

...view details