కర్ణాటక సంప్రదాయ క్రీడ 'కంబళ'లో ఇటీవలె సరికొత్త రికార్డు సృష్టించాడు నిశాంత్ శెట్టి. బోల్ట్‌తో పాటు ఇటీవల ఇదే క్రీడల్లో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన శ్రీనివాస్ గౌడను.. ఇతడు దాటేశాడు. అందుకే నిశాంత్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిశాంత్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు.
"సంప్రదాయ క్రీడ 'కంబళ'లో వేగంగా పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించిన కంబళ జాకీ నిశాంత్ శెట్టికి అభినందనలు. అత్యంత వేగంగా పరుగెత్తే పోటీదారుల్లో అతడు ఒకడిగా నిలిచాడు. ఇలాంటి పోటీలతో ప్రతిభ దాగి ఉన్న ఎంతో మంది వెలుగులోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. వారిని ప్రోత్సహిస్తే మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
ఇటీవల జమైకా వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డును తలదన్నేలా 'కంబళ' పోటీల్లో పరుగెత్తి తీసి సంచలనం సృష్టించాడు శ్రీనివాస గౌడ. అయితే అది మరిచిపోక ముందే మరో కంబళ పోటీదారుడు నిశాంత్ శెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దున్నపోతులతో కలిసి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరుగెత్తి విజయం సాధించాడు. అంతకుముందు శ్రీనివాస 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అయితే వేగం పరంగా లెక్కిస్తే 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస 9.55 సెకన్లలో చేరుకుంటే, నిశాంత్ కేవలం 9.51 సెకన్లలో పరుగెత్తినట్లుగా తేలింది. ఫలితంగా బోల్ట్ (9.58 సెకన్లు), శ్రీనివాస రికార్డును నిశాంత్ అధిగమించినట్లు 'కంబళ' క్రీడానిర్వాహకులు ప్రకటించారు.
ఇదీ చూడండి :దుబాయ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి