ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు టీకా ఇవ్వడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రా. అందుకు అనుగుణంగా త్వరలోనే ఓ ప్రణాళిక రచించి, అమలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
"ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడమే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఇప్పటికే వైద్యారోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖలు, జాతీయ మాదకద్రవ్య నిరోధక సంస్థ (నాడా) సహ సంబంధిత విభాగాలతో చర్చలు జరుపుతున్నాం. సరైన ప్రణాళికను త్వరలోనే రూపొందిస్తాం."
-నరీందర్ బత్రా, ఐఓఏ అధ్యక్షుడు