తెలంగాణ

telangana

ETV Bharat / sports

US Open 2023 Winner Djokovic : యూఎస్ ఓపెన్​ విజేతగా జకోవిచ్.. 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం - Siegemund and Zvonareva us open

US Open 2023 Winner Djokovic : యూఎస్ ఓపెన్​ 2023 ఫైనల్స్​ పురుషుల సింగిల్స్ విభాగంలో టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్​ విజయం సాధించాడు. తాజా విజయంతో జకోవిచ్ తన ఖాతాలో 24వ గ్రాండ్​ స్లామ్ టైటిల్​ను వేసుకున్నాడు.

US Open 2023 Winner Djokovic
US Open 2023 Winner Djokovic

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 6:56 AM IST

Updated : Sep 11, 2023, 10:51 AM IST

US Open 2023 Winner Djokovic :యూఎస్ ఓపెన్​ 2023 ఫైనల్స్​లో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్​ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్​ ఫైనల్​ పోరులో మెద్వెదెవ్​తో తలపడిన జకోవిచ్​.. 6-3, 7-6, 6-3 తేడాతో గెలుపొందాడు. తాజా విజయంతో 24వ గ్రాండ్ స్లామ్​ టైటిల్​ను జకోవిచ్.. తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్​లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్‌ కోర్ట్‌ను సమం చేశాడు. ఈ విజయంతో 36 ఏళ్ల జకోవిచ్ తిరిగి ప్రపంచ నంబర్-1 ర్యాంక్​ను సొంతం చేసుకున్నాడు.

ఆట సాగిందిలా.. 3 గంటల 17 నిమిషాల పాటు సాగిన ఆటలో ప్రారంభం నుంచే జకోవిచ్దూకుడుగా ఆడాడు. తొలి సెట్​లోనే 6-3 తో ఆధిపత్యం చలాయించాడు. ఇక రెండో సెట్​లో మెద్వెదెవ్.. జకోకు దీటుగా బదులిచ్చాడు. కానీ చివర్లో మళ్లీ పట్టుకోల్పోయిన మెద్వెదెవ్ వెనకబడ్డాడు. ఈ సెట్​ను జకో.. 7-6తో గెలిచాడు. ఇక కీలకమైన మూడో సెట్​లోనూ జకోవిచ్​ జోరు ప్రదర్శించి.. 6-3 తేడాతో మెద్వెదెవ్​ను ఓడించాడు. ఓవరాల్​గా జకోవిచ్​కు ఇది నాలుగో యూఎస్​ ఓపెన్ టైటిల్.

జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు..

  • ఆస్ట్రేలియా ఓపెన్- 10
  • వింబుల్డన్- 7
  • యూఎస్ ఓపెన్- 4
  • రోలాండ్ గారోస్- 3

యూఎస్ ఓపెన్ 2023లో జకోవిచ్​..

  • రౌండ్ 16.. గొజోతో తలపడిన జకోవిచ్.. 6-2, 7-5, 6-4 తో గెలిచాడు.
  • క్వార్టర్ ఫైనల్.. క్వార్టర్స్​​లో జకోవిచ్ ఫ్రిట్డ్​తో తలపడ్డాడు. ఈ గేమ్​ను జకో.. 6-1, 6-4, 6-4 తేడాతో సొంతం చేసుకున్నాడు.
  • ​సెమీస్.. షెల్టన్, జకోవిచ్ మధ్య జరిగిన సెమీస్ పోరులో జకోవిచ్.. 6-3, 6-2, 7-6 తో నెగ్గి ఫైనల్స్​లోకి దూసుకెళ్లాడు.​

ఇంతకుముందు.. అతడు 2011, 2015, 2018లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో జకోవిచ్​కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇదివరకు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్​ టైటిల్ నెగ్గాడు. కాగా 2021 యూఎస్ ఓపెన్​ పురుషుల సింగిల్స్ ఫైనల్​ కూడా జకోవిచ్, మెద్వెదెవ్ మధ్యే జరిగింది. అప్పుడు జకోవిచ్​ను మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్​ను ముద్దాడాడు.

US Open 2023 Women's Doubles Final: ఇదే యూఎస్ ఓపెన్​ 2023 ఉమెన్స్​ డబుల్స్ ఫైనల్​​లో డబ్రోస్కీ-రౌత్​లిఫ్ జోడీ విజయం సాధించింది. తుది పోరులో ఈ జోడీ.. 2020 ఛాంపియన్స్ సిగెమంద్-వొనారెవాపై 7-6 , 6-3 తేడాతో నెగ్గింది. అయితే డబ్రోస్కీ-రౌత్​లిఫ్ జోడీకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇక డబ్రోస్కీ కెనడా ప్లేయర్ కాగా.. రౌత్​లిఫ్ న్యూజిలాండ్ దేశానికి చెందిన క్రీడాకారిణి.

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌.. నెం.1 ర్యాంకు కైవసం.. నాదల్ రికార్డు సమం

Last Updated : Sep 11, 2023, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details