US Open 2023 Winner Coco Gauff :యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన కొకో గాఫ్ సంచలనం సృష్టించింది. సొంతగడ్డపై యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో రెండో సీడ్ అరీనా సబలెంకతో తలపడిన గాఫ్.. 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిన్న వయసులోనే యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మూడో అమెరికన్‌గా గాఫ్ రికార్డులకెక్కింది. గాఫ్ కంటే ముందు సెరెనా విలియమ్స్ 1999లో ఈ ఫీట్ సాధించింది.
ఫైనల్ సాగిందిలా.. బెలారస్‌కు చెందిన ప్లేయర్ సబలెంకతో.. గాఫ్ ఫైనల్‌లో తలపడింది. ఈ పోటీలో తొలి రౌండ్లో 2-6 తేడాతో గాఫ్ ఓడింది. అయితే తొలి రౌండ్లో వెనుకబడ్డ గాఫ్.. రెండో రౌండ్లో అద్భుతంగా పుంజుకుంది. తన పోరాట పటిమతో సబలెంక దూకుడుకు కళ్లెం వేసింది. దీంతో రెండో రౌండ్‌ను 6-3తో గాఫ్ తన ఖాతాలో వేసుకుంది. రెండు రౌండ్లు ముగిసేసరికి చెరొక గేమ్ గెలిచారు. దీంతో విన్నర్ డిసైడర్ కోసం మూడో రౌండ్ ఆడాల్సి వచ్చింది.
ఇక మూడో రౌండ్లో గాఫ్.. ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థిని ఎదుర్కొంది. ఈ రౌండ్లో సబలెంకతప్పిదాలను గాఫ్.. తనకు అనుకూలంగా మార్చుకొని చెలరేగింది. ఈ రౌండ్లో 6-2 తేడాతో సబలెంకను ఓడించి.. గాఫ్ టైటిల్ కొట్టేసింది. అంతేకాకుండా గత నాలుగేళ్లలో గాఫ్.. సబలెంకను ఏడాదికి ఓసారైనా ఓడిస్తూ వస్తోంది. ఈ విజయంతో గాఫ్.. వరుసగా 12 వ విక్టరీ నమోదు చేసింది. తాజా యూఎస్ ఓపెన్‌తో సహా.. గత 40 రోజుల్లో వాషింగ్టన్ ఓపెన్, సిన్సినటి ఓపెన్ టైటిళ్లను సాధించింది.