తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టు? - Sushil Kumar murder case

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో నిందుతుడిని అరెస్టు చేశారు.

Two-time Olympic medallist Sushil Kumar arrested
సుశీల్ కుమార్

By

Published : May 23, 2021, 6:22 AM IST

హత్య కేసులో నిందితుడైన ప్రముఖ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను దిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అతడు గత 15 రోజులుగా పరారీలో ఉన్నాడు. "జలంధర్‌ సమీపంలో సుశీల్‌ అరెస్టయ్యాడు. హత్య కేసులో మరో నిందితుడైన అజయ్‌ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు" అని పోలీసు వర్గాలు తెలిపాయి.

స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్

మే 4న ఛత్రసాల్‌ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్‌ అనే 23 ఏళ్ల రెజ్లర్‌ మరణించాడు. సుశీల్‌ కూడా అతడిపై దాడి చేశాడన్నది ఆరోపణ. అప్పటి నుంచి సుశీల్‌ కోసం దిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. అతడి ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

ఇది చదవండి:పెద్ద వివాదంలో సుశీల్​.. అసలేం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details