ప్రపంచ చెస్ రారాజు విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బోర్డు ముందు కూర్చున్నారంటే ఎత్తులకుపై ఎత్తు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. అయితే అలాంటి గ్రాండ్ మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్‌నే తికమక పెట్టారు కవల బాలికలు. దీంతో ఆయనికి ఏమి చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఏం జరిగిందంటే?
విశ్వనాథ్ ఆనంద్‌నే తికమక పెట్టిన కవలలు - చెస్ ఒలింపియాడ్
దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్‌నే తికమకపెట్టారు కవల బాలికలు. గ్రాండ్‌మాస్టర్‌కు ఓ ప్రశ్న వేసి గందరగోళానికి గురయ్యేలా చేశారు. దీంతో ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు తడబడ్డారు. చివరకి సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దాన్ని చూసేయండి..
ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో ఆనంద్ ప్రశ్న-జవాబుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవల బాలికలు ఆ చెస్ దిగ్గజాన్ని ఏం అడగాలో అని ఆలోచించి 'చెస్‌బోర్డులో పావులను ఎలా రీసెట్ చేయాలి?' అని అడిగారు. దానికి ఆనంద్ సమాధానమిస్తుండగా మళ్లీ ఒక బాలిక లేచి.. 'ప్రత్యర్థి పావులను ఎలా గందరగోళానికి గురి చేయాలి?' అని అడిగింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆనంద్.. 'అలా చేయడానికి నా వద్ద ఎలాంటి ఉపాయాలు లేవు' అని బదులిచ్చాడు. అయితే, ఈ వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది ఇప్పుడు వైరల్‌గా మారింది. చివరికి ఆనంద్ కూడా ఆ వీడియోను 'క్వశ్చన్ ఆఫ్ ది డే' అని ప్రశంసిస్తూ తిరిగి పోస్టు చేశాడు.
ఇదీ చూడండి: జూడోలో అదరగొట్టిన భారత్.. కామన్వెల్త్లో రెండు పతకాలు