కరోనా వ్యాప్తి వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ఎలా సాగుతుందనేది నిక్కచ్చిగా చెప్పడం కష్టమని అన్నారు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన టోక్యో నిర్వహణ కమిటీ 136వ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
వైరస్ వల్ల ఎన్నడూ చూడని వివిధ ఆరోగ్య పరిస్థితులనూ ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఫలితంగా ఈ మెగాటోర్నీకి తక్కువ మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.