భారత స్టార్ మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇటీవల స్వలింగ సంపర్కంపై పెదవి విప్పిన ద్యుతీపై ఓ ప్రముఖ క్రీడా ఛానెల్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ప్రశంసలతో కూడిన ట్వీట్ చేశాడు.
" ఈ కథనం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయం. యూ ఆర్ ట్రూ ఛాంపియన్ "
-- రాహుల్ రవీంద్రన్, టాలీవుడ్ దర్శకుడు
మూడేళ్ల క్రితమే తెలుసు...
ఇటీవల తన బంధం గురించి ద్యుతీ బాహాటంగా ప్రకటించినా మూడేళ్ల క్రితమే ఈ విషయం తమకు తెలిపినట్లు ఆ క్రీడా ఛానెల్ పేర్కొంది. ప్రేమకు లింగభేదం లేదని, మనసులు కలిస్తే చాలని ద్యుతీ 2016 లోనే చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికే భారత్‌లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన వ్యక్తిగత విషయాల తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడుదొడుకులనూ వివరించింది.
ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబట్టారు. ఎవరి అంగీకారం ఉన్నా.. లేకపోయినా తన ప్రియురాలితోనే బంధం కొనసాగిస్తానని చెబుతోంది ద్యుతీ.
ప్రస్తుతం నాగార్జున, రకుల్ జంటగా 'మన్మథుడు-2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాహుల్. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగ్ హీరోగా వచ్చిన 'మన్మథుడు' చిత్రానికిది సీక్వెల్.
ఇవీ చూడండి--> ద్యుతీని ఇంట్లోంచి పొమ్మంటున్న కుటుంబం!