ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడల్ని వచ్చే ఏడాది జరపనున్నారు. అయితే దీని ప్రభావం 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌పై ఏ మాత్రం ఉండదని ఒలింపిక్ కమిటీ నిర్వహకులు టోనీ ఎస్టాంగ్యుయెట్ అన్నారు. ఆ పోటీలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు.
'2024 వేసవిలో పారిస్ ఒలింపిక్స్ యథావిధిగా జరుగుతాయి. వాటిపై ఏం ప్రభావం లేదు. ప్రస్తుత ఒలింపిక్స్ తేదీ మార్చడం అథ్లెట్లకు మంచిదే'