జ్యోతి వెలగడం.. ఒలింపిక్స్ మహా సంబర ఆరంభానికి గుర్తిది! జులై 23న టోక్యోలో మొదలయ్యే ఈ ప్రపంచ క్రీడా వేడుకను ప్రతిబింబిస్తూ జ్యోతి వెలిగింది.. గురువారమే టార్చ్ రిలే కార్యక్రమం మొదలైంది. 121 రోజుల పాటు సాగే ఈ రిలే.. ఒలింపిక్స్ ఆరంభోత్సవ కార్యక్రమం వద్ద ముగుస్తుంది. జపాన్లోని ఫకుషిమా ప్రాంతం నుంచి ఈ రిలే ఆరంభమైంది.
ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. రిలే షురూ - ఒలింపిక్స్ లేటేస్ట్ న్యూస్
టోక్యో ఒలింపిక్స్ జ్యోతి వెలిగింది.121 రోజుల పాటు సాగే టార్చ్ రిలే క్యార్యక్రమం ఫకుషిమాలో గురువారం ప్రారంభమైంది.
ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. టార్చ్ రిలే షురూ
2011లో సునామీ కారణంగా ఫకుషిమా తీవ్రంగా నష్టపోయింది. సుమారు 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన ఫుట్బాల్ మహిళల జట్టులో కీలక సభ్యురాలు అజుసా.. ఇండోర్ సాకర్ శిక్షణ కేంద్రం నుంచి ఈ జ్యోతిని తీసుకురాగా.. మిగిలిన 14 మంది సభ్యులు, కోచ్ నోరియో ఆమెతో కలిసి ముందుకు సాగారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అభిమానులను అనుమతించలేదు.