తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​ విజేతలకు సీఎం బంపర్​ ఆఫర్​ - ఎంకే స్టాలిన్

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధిస్తే నగదు ప్రోత్సాహం అందజేయనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.

prize money for Olympic winners
ఒలింపిక్స్​ విజేతలకు రివార్డు

By

Published : Jun 26, 2021, 3:50 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పతకాలు సాధించిన వారికి రివార్డు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు.

బంగారు పతక విజేతలకు.. రూ.3 కోట్లు, వెండి గెలుచుకున్న వారికి రూ.2 కోట్లు, కాంస్యానికి రూ.1కోటి చొప్పున ఇవ్వనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. 2012 లండన్​ ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన గగన నారంగ్.. తమిళనాడు నుంచి ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక అథ్లెట్.​

అంతకుముందు అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం(జూన్ 23) సందర్భంగా హరియాణా సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్​ కూడా విజేతలకు క్రీడా విభాగంలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు. దీంతో కొత్త ఆటగాళ్లను ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

ఇదీ చూడండి:ఒలింపిక్స్​లో ఆ రూల్.. కండోమ్ తయారీదారుల నిరాశ

ABOUT THE AUTHOR

...view details