తెలంగాణ

telangana

ETV Bharat / sports

విధుల నుంచి తప్పుకున్న 10 వేల మంది వాలంటీర్లు

మరో 50 రోజుల్లో టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​ ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపుగా 10 వేల మంది వాలంటీర్లు తప్పుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరోనా(Covid-19) సోకుతుందన్న భయంతోనే వారు వైదొలిగినట్లు తెలిపారు.

Tokyo Olympics: Organisers say around 10,000 volunteers have quit
ఒలింపిక్స్​ నుంచి తప్పుకున్న 10 వేల మంది వాలంటీర్లు

By

Published : Jun 3, 2021, 12:17 PM IST

టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics)లోని 80వేల మంది వాలంటీర్ల(olympics volunteers quit)లో 10వేల మంది తప్పుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాలంటీర్లగా కొనసాగేందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది.

"వాలంటీర్లు తప్పుకోవడానికి కారణమైతే.. నాకు తెలిసి కరోనా సోకుంతుందని భయంతో వైదొలగి ఉండొచ్చు" అని ఓ జపాన్​ న్యూస్​ నిర్వాహక కమిటీ సీఈఓ తోషిరో ముటో అన్నారు.

కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics Postponed)​ సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. టోర్నీని ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నట్లు ఐఓసీ(IOC) వెల్లడించింది. అయితే గతంలో టోక్యో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి(Yoshiro Mori).. మహిళలపై చేసిన వ్యాఖ్యలతో మరి కొంతమంది వాలంటీర్లు తప్పుకున్నారు.

ఇదీ చూడండి:Tokyo Olympics: ఒలింపిక్స్​ ప్రారంభానికి మరో 50 రోజులే!

ABOUT THE AUTHOR

...view details